పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

శ్రీ వేంకటేశ్వర వచనములు



69

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా ! సకల ప్రాణుల శరీరంబులు నీకు క్షేత్రంబులు. నీవు క్షేత్రజ్ఞుండవు. జీవులు నీ కమతీలు. ఇంద్రియంబులు నీకు నేరు కలపలు. ఇహపర సౌఖ్యంబులు కాఱు వేసంగిపంటలు. దేహానుభవంబులు నీవు వెట్టెడి జీతంబులు. లోకులు చేసిన ధ్యానానుష్ఠానఫలంబులు కొల్చు భండారంబులు. ఈరీతి ముందరికిని సందఱ హృదయంబులను జ్ఞానభక్తి వైరాగ్యంబు లనియెడి బీజంబులు మొలవం బెట్టింపుము ; తొల్లి బలభద్రరాముండవై నాఁగలి ధరియించి దున్ని కాళింది కాలువలు దీర్చితివట ! శ్రీ వేంకటేశ్వరా !

70

అసురకులసంహారకా ! నేను జన్మం బెత్తి వయోమదోద్రేకంబున యుక్తాయుక్తంబు లెంచక మనస్సుం బాఱవిడిచి నానాభోగంబు లనుభవించి యందువలనఁ బుణ్యపాపంబుల యిఱుకునం జిక్కి కర్మబద్దుండనై విడిపించుకొన శక్తుండఁగాక బందెదొడ్డిం జిక్కిన పసరంబువలెను, పాశమునం బడిన మర్కటంబుపగిదిని, జోగిచేతం జిక్కిన సర్పంబురీతిం, బసిరికాయలోని కీటంబువలె, నుండి నీవు సర్వలోకనాథుండ వగుటం జేసి విన్నవించితిని. నే నీకుం దగులై నవాఁడ నగుట నీవు నన్నుఁ గరుణిం చి నీ ముద్రవేసి నీ దాసునిఁగాఁ జేసికొంటివి. ఈ సంతోషంబున నిన్నెంతయుఁ గొనియాడెద నోహోదేవరా ! శ్రీ వేంకటేశ్వరా !

71

. అమృతమధనా ! మహాపురుషులు మిమ్ముంగోరి యతి ఘోర తపంబులు సేయు వేళలఁ బక్షులు దేహంబులం గూళ్లం బెట్టునట ! ఇటు వంటి నియమంబున మిమ్ము నే నెట్లు ధ్యానంబు చేసి బ్రత్యక్షంబు సేసికొని మెప్పించెద ? ఇంత లేసి పనులకు సమర్థుండనా ? మీకుఁ జేతు