పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు

33

లెత్తి మ్రొక్కంగలవాడ నింతేకాని తొల్లి మీరు రామావతారం బైనవేళ వనంబున సంచరించునప్పుడు, కృష్ణావతారంబై నవేళ నందవ్రజంబున సంచరించునప్పుడు పాషాణతృణగుల్మల తాదులు మీ పాదంబులు సోఁకి పావనంబయ్యెనట ! అవి యే తపంబులు చేసినవి ? మాకు మీ శ్రీపాదములే గతి ; శ్రీ వేంకటేశ్వరా !

72

వైజయంతీవనమాలికాధరా ! ఈ బ్రహ్మాది దేవతల యైశ్వర్యంబులు నీ దేవుల కటాక్షవీక్షణంబులోఁ గించి న్మాత్రంబువలనం బొడమినవి. మహాపురుషుల మాహాత్మ్యంబులు నీవిచ్చు వరంబులలో లవ లేశంబులు. అన్ని సదువుల ప్రభావంబులు నారాయణాష్టాక్షరంబులలోని సహస్రాం శంబులు. ఉత్పత్తి స్థితి లయంబులు నీ మాయాశక్తి సంకల్పమాత్రంబులు. నీ మహామహిమలం దెలియ నెవ్వరివశము ? అగోచరములు ! తర్కవాదముల కభేద్యుండవు; యుక్తుల కసాధ్యుండవు; భక్తులకు సులభుండవు; నిన్ను నీవే యెఱుంగుదువు గాక యితరులకు నెఱుంగఁ దరమా; శ్రీ వేంకటేశ్వరా !

73

నరకాసురవైరీ ! ఈ కల్పంబున బ్రహ్మ దేవునికి నేఁబది యేండ్లు చెల్లెనట ! అతని యొక్క దివసంబున స్వర్గంబునఁ బదునలువురు దేవేంద్రు లేలుదురట. ఇప్పు డేడవ దేవేంద్రుఁ డేలుచున్నాఁడట. నేను నాఁట నుండి యెన్ని జన్మంబు లె త్తితినో ? యేయేజాతులం బుట్టితినో ? నేను మనుష్యుండ నని చెప్పుకొను టెట్లు ? పుట్టువులు వేఱుగాని యప్పటి జీవుండనే నేను, ఇప్పుడు బ్రాహ్మణజన్మంబునం బుట్టించి శ్రీ వైష్ణవునిం జేసి యేలితిరి. నాయంత నే నెఱింగి మీకు విన్నపంబు చేసిన వాఁడఁగాను. నాకుఁగా వేఱొకరు మీతోఁ బంతం బాడి యొడంబఱ చినవారు లేరు. మీయంతనే మీరు దయం దలఁచి నన్నుం బావ