పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు

బొంది ధనం బార్జింప వేసటనొందించి విరక్తునిఁగాఁ జేసితివి. నరకభీతి నివారించుటకై నీమీఁద భక్తి పుట్టించి నీ శరణు సొరం జేసితివి. ఈరీతి ననాదిసంసారసక్తుండనైన నన్ను ' నొక్కొక్క యుపాయంబున నీ కభిముఖునిఁగా దిద్దుకొంటివి. మఱి యింక నేఁ బ్రార్థించి నీకుం జేయు విన్నపము లేమియున్నవి? నీ దైవిక ప్రయత్నంబు ముందఱ నా మానుషప్రయత్నంబులు పచరింప సిగ్గయ్యెడిని. బాపురే! నిన్ను మెచ్చి నీ కేమి యొసగెదము? నిన్నుం బొగడుటే మాచేత నైనపని; శ్రీ వేంకటేశ్వరా!

27

పురుషోత్తమా ! వేదంబులు రత్నాకరంబులవంటివి; తమలోని యర్థంబులు బయలుపడనీయవు. పురాణంబులు గంటవేఁటకాండ్రవంటివి ; నానార్థంబులు చాటిచెప్పి భ్రమియింపంజేయుఁగాని యొకట నిశ్చయంబు దేటపడవు. భాట్టప్రాభాకరాది శాస్త్రంబులు నన్యోన్యశత్రులవంటివి; ఒండొంటిఁ ద్వేషించుఁగాని నీమీఁదిభక్తి బోధింపవు; దానంబు లింద్రజాలంబులవంటివి. ఒకటి పదియాఱై యనుభవింపఁ జేయుఁగాని ము క్తికిం దెరువుఁ జూపవు. ఇతర కర్మంబులు చేనిపంటలవంటివి; జన్మపరంపరకు హేతువులై దేహముల మొలపించుంగాని వై రాగ్యంబుఁ బొడమనీయవు. వీనిచందంబు లిట్టివి; ఏమిటం దెగు సంశయంబు? నిక్షేపంబు, వెట్టినవాఁడు చూపక కానంబడదు; నీవు సర్వజ్ఞుండవు; నాకు నుచితార్థంబు లిట్టివని తెలుపఁగదవే; శ్రీ వేంకటేశ్వరా!

28

పరమపురుషా : నేను దుర్జనుండ నని యెవ్వరు మఱుఁగుపడ విన్నపంబు సేయుదురో? యిప్పుడే నా నేరములు నేనే చెప్పుకొనియెద. మండాడుకొనియెద. తప్పుకొనియెద. అదీ యె ట్లంటివేని; నేఁ జేసిన పాపంబులు నన్నుం జుట్టుకొనియెనేని నీ నామోచ్చారణంబు చేసి తప్పించుకొనియెద. నీచేతఁ గల్పితంబులైన విషయంబులు బాధింప