పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు .

బహువిధానంబులు పెంచి కర్మంబులు చేసి మిమ్ము మెప్పించ శక్తుండఁ గాను. మీకు దయ యుండ నతి ఘోర తపంబుచేసి హర్షించి వరంబు లడుగనేర. ఉద్ధవునిరీతి గోపికలకు మీకు నెడమాటలాడి మిమ్ము నభిముఖునిఁ జేసికొన సమర్థుఁడంగాను. సుగ్రీవునిగతి సేనలం గూర్చుకొని మీ యవసరమునకుం గొలువ బలవంతుండంగాను. నా పురుషార్థం బీపాటి. నన్నుఁజూచి 'వీఁడేల తగిలెడు' నని కలంగకు; పరుండువానికి భూమి యాధారంబు; నదులకు సాగరంబే గతి; పక్షులకు వృక్షంబే వసియింపఁజోటు; సస్యములకు వర్షంబు; నాకు నీవు. శీృ వేంకటేశ్వరా!

25

సంకర్షణా! నీ మాయామాత్రంబున మానవులకు నీవు దారులోహపాషాణమృణ్మయంబులైన రూపంబులు వహించుకొని గుళ్లలోపలను ఇంటింటివారిచేతను బూజలుగొని వారు గోరిన వరంబు లొసగుచున్నాఁడవు. ఏమియు నెఱుంగనివారి కెంత సులభుండనై యున్నాఁడవు? నీ వితరణ గుణంబు ని న్నటువలెఁ జేసినదియో? ఈగతిం గరుణించుట నీ వ్రతంబో? నీ కది స్వభావగుణంబో? దీనులఁ గాచుట కీర్తియో? రామరామ! అరు దరుదు నీ మహత్త్వంబు! నీ చరిత్రంబు విని వెఱఁగయ్యెడు. మేలు మేలు! ఎట్లెన నింక నాజన్మములు ఫలించె; మనోరథంబు లీడేఱె. సంతోషంబు పరిపూర్ణంబయ్యె; శీృ వేంకటేశ్వరా!

26

దానవారీ | తొల్లి నే నుత్తమగుణంబు లెఱుంగను. నామీఁదం గృపపెట్టి పెద్దలు న న్నచారవంతుం డందురను నభిమానంబు రేఁచి నన్ను సాత్త్వికుంగాఁ జేసితివి. ఒరులు నన్నుం జెనకుదురోయని పిఱికితనంబుఁ బొడమించి శాంతునిఁగాఁ జేసితివి. కాంతలు ధనం బపహరింతు రనియెడు లోభంబు పుట్టించి జితేంద్రియునిఁగాఁ జేసితివి. అలమటలం