పుట:Sri-Srinivasa-Ayengar.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


నీకు నేను సహాయము చేయనని నీవు రాగానే చెప్పితిని గదా ! అనిరి. ఈ పిల్లవాఁడు ఇంగిత జ్ఞానముకలవాఁడు గావున శ్రీమా౯గారికి ఏబదులు చెప్పక నిలఁబడిన మీదట 5 రూపొయనోటు నిచ్చి పంపివేసిరి. ఇంటివారు ఈకుఱ్ఱవాని 4, 5 గంటలు కాచునట్లు చేసినందుకు విచారపడిరి కాని శ్రీమా౯ ఎదుట ఏదియు చెప్పరైరి. వారి అభిప్రాయములకు విరుద్ధముగ ఎవరేది చెప్పినను సహించువారు కారు. వెంటనే కండ్లు ఎఱ్ఱచేసికొని పెద్దగొంతుతో చీవాట్లు పెట్టుదురు కావున, ఎవరును వారిని ఎందును ఎదుర్కొనెడువారుకారు. కుమార్తె శ్రీమతి అంబుజమ్మాళ్ కారాగారము ప్రవేశించుట వీరి కెంతమాత్రము నచ్చలేదు. కుమార్తె శాసనోల్లంఘనము గావింప తలచితినని తండ్రితో చెప్పగానే వీరికి అపరిమితకోపము వచ్చెను. నీ యంతరాత్మ జైలు ప్రవేశింపు మని సూచించినచో అట్లే చేయవచ్చును. గాని ఇతరుల ప్రోత్సాహముగాని నలుగురి మన్ననలకు పాత్రమగుటకుఁగాని నీవు జైలునకువెళ్ల ప్రయత్నింపరాదు. తాను జైలుకు వెళ్లక శ్రీ కె. భాష్యం నీవంటివారిని జైలుకు వెళ్లుమని ప్రోత్సహించుచున్నాఁ డని నాకు తెలిసినది