పుట:Sri-Srinivasa-Ayengar.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

99


బలగముతో చెన్నపట్టణమున గుమిగూడిరి. వీరిలో శ్రీపట్టాభిగారు ఒకరు. ఇందరు తెలుగువారు చెన్నపట్టణము వచ్చినందున అల్లరు లేర్పడు నని యధికారులు తలచి ఎందులకును మంచిదని ముందునాటి సాయంకాలమే శ్రీ కొండా వెంకటప్పయ్యను, శ్రీపట్టాభిగారిని మరికొందరిని అరెస్టు చేసిరి. కాని వీరినందరిని రాత్రి 10 గం||లకు వదలిపెట్టిరి. తెనుగువారు అరవలకన్న ధైర్యస్థైర్యములుగలవా రని తలచి శ్రీమా౯గారికి మనస్సంకటము కొంత కలిగింప గల్గిరేగాని దీనివల్ల ఏప్రయోజనము లేదని ముందు విశదమాయెను.

ఒకరోజున శ్రీమా౯ డ్రాయింగు రూమున కూర్చొని చదువుకొనుచుండగా ఒక బ్రాహ్మణ బాలుఁడు వారిని సమీపించి యేదైన కొంత సహాయము చేయుమని ప్రార్థించెను. శ్రీమా౯గారు ఆగ్రహపడి బ్రాహ్మణబాలుఁడు బిచ్చమెత్తుట తన కెంతమాత్రము ఇష్టము కా దనియు, తా నే సహాయము కావింప ననియుచెప్పి బయటికి వెళ్లుమనెను. ఆకుఱ్ఱవాడు పట్టుదలతో శ్రీమా౯నెదుట కొంతసేపు నిలఁబడెను. వానివైపుచూడక శ్రీమా౯ ఏదో ఒక పుస్తకమును చదువుచుండిరి. ఆమీద ఆ కుఱ్ఱవానిని ఇంకను ఎందులకై కాచియున్నావు?