పుట:Sri-Srinivasa-Ayengar.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


గావించెను. ఆంధ్రకమిటీనిర్వాహకవర్గము బెజవాడలో సమావేశమై 144 వ సెక్షను నుల్లంఘింప తీర్మానించెను. సొంతకారణములవల్ల ఉల్లంఘనము సాగింపలేనివారు రాజీనామా లివ్వవలెనని ఉల్లంఘనమునకు సంసిద్ధులైనవారే ముంచుకు వచ్చి చర్య పూనవలె ననియు తాఖీదు వచ్చెను. కాని ఉల్లంఘనమునకు సంసిద్ధుఁడ నని చెప్పి శ్రీపట్టాభి చెన్నపట్టణమునకు వచ్చెనుగాని అందుకు ముందురోజునకే అరవకమిటీ సమావేశమై అధ్యక్షుని కాస్టింగు వోటుతో 144 వ సెక్షను ఉల్లంఘింపరాదనే తీర్మానమును శ్రీ పట్టాభిగారు తెలిసికొనిరి. వీరేల ముందురోజు సభకు రాలేదో వారికి తప్ప ఇతరులకు తెలియదని శ్రీ కొండా వెంకటప్పయ్య మొరపెట్టెను. 1929 సం|| పై సంఘటన యేర్పడినయెడల కాంగ్రెసు జాతీయవాదు లందరుసు తప్పక సెక్షను ఉల్లంఘింపవలె నని కలకత్తా కాంగ్రెసు శాసించెను. ఇందుకు ముందే పైతీర్మానమునకు కారకులైన శ్రీ సాంబమూర్తిగారు నిర్బంధింపబడినందున తెనుగువారి కిది ఆత్మీయసమస్య ఆయెను. చెన్నపట్టణమున రాజకీయవ్యవహారముల నన్నిటిని శ్రీమా౯ ఎస్. శ్రీనివాసఅయ్యంగారు ముఖతః సాగించుచుండిరి. తెనుగుదేశమందలి ప్రముఖు లనేకులు నాడు తమ