పుట:Sri-Srinivasa-Ayengar.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

97


జైలున యుంచిరి కావున నాడుబందరు తెనుఁగుదేశమందలి సంపూర్ణస్వాతంత్ర్య వాదులకు తీర్థయాత్రాస్థలమయ్యెను. అప్పటివరకు 'పెల్లికికూడ భిక్షముపెట్టని ఈ పట్టాభి' అని అనేకులు భావించుచుండిరి. కాని యిప్పుడు విధిలేక తీర్థయాత్రికులకు ఆతిథ్యము ఒసఁగఁదలఁచి వచ్చెను. బందరున రోజూ సాగుచుండిన సభలకు శ్రీపట్టాభిగారు అధ్యక్షతవహించి పిన్నల పెద్దల సభవారికి నెరుకపరచుచుండిరి. అప్పుడు శ్రీసాంబమూర్తిగారు కారాగారము ప్రవేశింపగానేవీ రాక్రమించియున్న రెండుస్థానములు అనగా, ఆంధ్ర రాష్ట్రకమిటీ అధ్యక్షత, అఖిలభారత వర్కింగు కమిటీ సభ్యత్వము, శ్రీపట్టాభిగారికి సంక్రమించి 'దేవుఁడా' అని సంపూర్ణ స్వాతంత్ర్య ప్రచారము సాగింపవలసివచ్చెను. 1928 సం||న పైసంభవములు జరిగెను. సైమనుకమీషను బహిష్కార ప్రచారము కాంగ్రెసు కక్షవారు సాగింతు రని యధికారులు 144 వ సెక్షను క్రి. ప్రొ. అమలునఁబెట్టిరి. ఆంధ్ర, అరవరాష్ట్రకమిటీలు సంయుక్త సమావేశమొనర్చి శ్రీమా౯గారి సలహామీద సాధకబాధకముల ఆలోచించుకొని, అవసర మేర్పడినచో పై సెక్షసును ఉల్లంఘింప మని అఖిల కాంగ్రెసుకమిటీ సలహా