పుట:Sri-Srinivasa-Ayengar.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య, శ్రీ వేమవరపు రామదాసు, బారిష్టరు శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ మున్నగువారు వీరి నిజస్వభావమును గుర్తించి వీరిని సత్కరించిన సందర్భము లనేకములు నాకు తెలియును గావున ఈ సందర్బమున వెల్లడించు చున్నాను.

సైమను కమీషను

ఈసందర్భమున ఆంధ్రదేశమందలి రాజకీయవేత్తల చర్యలగూర్చి కొంత చెప్పదలచితిని. వీరిలో ప్రముఖులగు శ్రీ బులుసు సాంబమూర్తిగారు సైమను కమీషను బహిష్కారప్రయత్నమున చెన్నపట్టణమున అల్లరిసాగింపదలచిరని అధికారులకు దెలిసెను. కలకత్తా గుంటూరుపట్టణములలో వీరు తీవ్ర ఉపన్యాసములను సాగించిరని బ్రిటిషు అధికారులు తలచినందున మదరాసునకు వీరు తమ అనుచరులతో వచ్చుచుండగా బెజవాడ రైలుస్టేషనున వీరిని పోలీసులు అరెష్టుచేసి బందరునకు తీసికొనివెళ్లి నెలరోజులు రిమాండున ఉంచిరి. ఇందుచే మూలబడియున్న శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య జీవితమున మరొక రాజకీయపరివర్తనము ఏర్పడెను. శ్రీసాంబమూర్తిగారిని కేసువిచారణకై బందరుస సబ్