పుట:Sri-Srinivasa-Ayengar.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

95


రాజమండ్రిలో శ్రీ విక్రమహాలునకు సహాయము కోరగా 2 వేలుఇచ్చి శ్రీ అణ్ణామలశెట్టిగారిచే 3 వేలు ఇప్పించిరి. ఆంధ్రదేశమందలి ఏపత్రికా విలేఖరిగాని సంస్థగాని వీరిని ద్రవ్యసహాయము కోరినచో వెంటనే వారికోరికలను సఫలము గావించు చుండిరి. కాంగ్రెసు సమావేశములకువెళ్లు కాంగ్రెసు డెలిగేట్లు కొందరికి రైలుఖర్చులకు సొమ్ము నివ్వుమని కోరినపుడెల్ల నిరాఘాటముగ చెక్కు వ్రాసి ఇచ్చుచుండిరి. వీరు కాంగ్రెసున ప్రవేశించినందున వీరి ఆదాయము తగ్గెనే కాని వీరి దానధర్మములు హెచ్చాయను. అయిదారు సంవత్సరములలో రెండులక్షలు ఖర్చుపెట్టిరని వీరికుటుంబీకులు చెప్పగా అనేకులు ఆశ్చర్యపడిరి. శ్రీ పట్టాభిసీతారామయ్యవంటివారు వీరి డబ్బును లాగికొన చూచుచుండిరే కాని కాంగ్రెసు వ్యవహారములలో శ్రీ గాంధీగారినే అనుసరించుచుండిరి. కావున, వారితోనేగాక మరికొందరు తెనుగువారితో తమ యభిప్రాయములను చెప్పెడువారు కారు. వాగ్ధోరణిలో కొన్నిమాటల వల్ల వీరియూహ లిట్టివని వారు తేలిసికొనవలెనేగాని నిశ్చితాభిప్రాయములను గుర్తింపరైరి. వీరి ఆఖరిదశలో శ్రీ న్యాయపతి సుబ్బారావు పంతులు, శ్రీ మోచర్ల రామచంద్రరావుపంతులు