పుట:Sri-Srinivasa-Ayengar.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

94

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


మనస్సులనుగూడ కలవరపెట్టెను. మిత్రుడును విరోధి, ధనవంతుఁడు బీద అనుభేదములు వీరు పాటింపలేదు. మనస్సున తలచినదానిని చెప్పినమీదటనే వీరి కోపము తగ్గును. కాశీవిశ్వవిద్యాలయమునకును, మదరాసు విశ్వవిద్యాలయమునకును, రామనాథపురమునందలి లైబ్రరీ మున్నగువానికిని వీ రిచ్చిన విరాళములగూర్చి చెప్పియుంటిని. తెనుగుదేశము నుండి కాంగ్రెసుకు సంబంధించినవారు ఎవరైనను వీరివద్దకువచ్చి సహాయము కోరినచో వెంటనే గావించెడువారు. మహర్షి శ్రీ బులుసు సాంబమూర్తి, శ్రీమద్దూరి అన్నపూర్ణయ్యగార్లకు వారు కోరినపుడెల్ల గొప్పమొత్తముల నిచ్చిరి. శ్రీదుగ్గిరాల గోపాలకృష్ణయ్య చీరాల సత్యాగ్రహము సాగించునపుడు నాద్వారా వారికి వేయిరూపాయలు ముట్టజెప్పిరి. శ్రీ ప్రకాశముగారి స్వరాజ్యపత్రిక ఇబ్బందులకు లోనై చిక్కుపడుచున్నప్పుడు నేను 10 వేలు అప్పుగ నిప్పించితినిగాని ఈమొత్తమును స్వరాజ్యకంపెనీవారు తిరిగి వారి కివ్వరైరి.

శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్యగారి బందరు జాతీయకళాశాలకు ఏటా గొప్పవిరాళము ఇచ్చుచుండిరి. శ్రీ తెన్నేటి సత్యనారాయణగారు