పుట:Sri-Srinivasa-Ayengar.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

101


కావున మీ యుభయులవర్తనలు నేను పూర్తిగ గర్హించుచున్నాను అనిరి. అంతటితో తృప్తిచెందక ఎన్నో యితర అంశములనుగూర్చి కుమార్తెతో నాడు ముచ్చటించిరి. స్త్రీలు కుటుంబధర్మమును త్యజించి రాజకీయరంగపోరాటమున పాల్గొన రాదు అనెడి తన దృఢాభిప్రాయమును శ్రీమా౯గారు సూచించిరి. వీరు పురుషులవలె తండ్రి, ఆస్తికి హక్కుసంపాదించుటలో అభ్యంతరము నా కేదియు కనఁబడదు. పురుషులతో సరిసమానముగ పౌరవారసత్వహక్కు లన్నిటిని వీరు సంపాదించుట అవసరమే కాని ఇంటిపనులు మాని తమ బిడ్డలపోషణను ఇతరుల అధీనము కావించి ప్రజాసేవకు ఏస్త్రీగాని దిగుట మన కుటుంబముల పురోభివృద్ధికి ఆటంక మని వీరు భావించెడివారు. భర్తకు సౌకర్యములను గావింపక డ బ్బున్న దని నౌకరులచే అన్నిపనులఁ జేయించుట పతిభక్తికానేరదు.

ఈ పై కారణములవల్లనే శ్రీమతి సరోజినిదేవిని, అనిబిసెంటు మున్నగువారిని శ్రీమా౯ తృణప్రాయముగాఁ జూచెడివారు. స్వరాజ్యకక్ష సంస్థాపనకై శ్రీ సి. ఆర్. దాసుగారు మదరాసురాష్ట్రమునకు వచ్చిరి. శ్రీ సత్యమూర్తి, శ్రీ రంగస్వామి అయ్యం