పుట:Sri-Srinivasa-Ayengar.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


గారు మున్నగు ఆరవప్రముఖులుకొందరు ఒక సభ సాగించి మదరాసురాష్ట్ర స్వరాజ్యకక్షను నిర్మించి ఇందుకు శ్రీ సత్యమూర్తిగారిని కార్యదర్శిగ యెన్నుకొనిరి. శ్రీ వేమవరపు రామదాసుపంతులుగారు తెనుగువారిని కొందరిని ప్రోగుచేసి శ్రీ వి. ఎల్. శాస్త్రిని ఆంధ్రశాఖకు కార్యదర్శి గావించిరి. నేను ఈ రెండు కమిటీలలోను సభ్యుఁడుగ నున్నట్లు జ్ఞాపకము. దైనికపత్రికలేనిది కక్షప్రచారము విరివిగ సాగదుగావున శ్రీ సి. ఆర్. దాసుగారు ఇందుకై అరవ తెలుగురాష్ట్రములలో కొంతసొమ్ము పోగుకావలె నని చెప్పుచు అరవజిల్లాలకు శ్రీరంగస్వామి అయ్యంగారు, శ్రీ సత్యమూర్తిగార్ల వెంటఁబెట్టుకొని ప్రయాణమైరి. ఈ ప్రయాణమున 20 వేలు శ్రీదాసుగారికి ముట్టుటయు, 10 వేలు విరాళములు పంపుదు మని వాగ్దత్తములుగావించుటయు తటస్థించెసు. కాని శ్రీరంగస్వామిఅయ్యంగారు అరవ దినపత్రిక ఆర్థికచిక్కులవల్ల వసూలు కావలసిన పదివేలును వసూలు చేసి స్వదేశమిత్ర౯పత్రికను చక్కగ సాగింపుమని ఆదేశించిరి. శ్రీమా౯ సత్యమూర్తిగారికి న్యాయవాదవృత్తిలో నభిరుచి లేనందున వీరికి సంపాద్యము లేకయుండెను. కొంతకాలము శ్రీమా౯గారు వీరికి నెలకు వందరూపాయలు