పుట:Sri-Srinivasa-Ayengar.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

103


నిచ్చుచుండిరిగాని శ్రీసత్యమూర్తిగారు తిరునెల్వేలి కాన్ఫరెన్సు ముందురోజున, శ్రీగాంధీగారి సహాయ నిరాకరణమున కనుకూలముగ సుపన్యసించినందుచే శ్రీసత్యమూర్తిగారికి అదిమొదలు ఏసహాయమును గావింపరైరి.

అరవస్వరాజ్యకక్షకు శ్రీ సత్యమూర్తిగారిని కార్యదర్శిగ నెన్నుకోబడినందుమీఁదట వీరికి నెలకు 150 రూసాయలు ఇవ్వ మని శ్రీ సి. ఆర్ . దాసుగారు చెప్పిరి. కావున శ్రీసత్యమూర్తిగారు సంతృప్తితో పాటుబడుటకు ప్రారంభించిరి. శ్రీ వి. రామదాసు పంతులుగారికి న్యాయవాదవృత్తిలో మంచి ఆదాయమేగాక గొప్పభూఆదాయముండుటచే సం||కు భూములవల్ల 10 వేలకు పైగా నికరాదాయ ముండెడిది. ఈ సందర్బమును శ్రీ సీ. ఆర్. దాసు తెలిసికొని ఆంధ్ర రాష్ట్ర స్వరాజ్యకక్ష జమాఖర్చుల నన్నిటిని వారే చక్క బెట్టవలె నని ఆదేశించిరి. శ్రీమా౯గారు అప్పట్లో బెంగుళూరుసకు వేసవి విశ్రాంతికై వెళ్లిరి కావునను శ్రీ రామదాసు, శ్రీ వి. ఎల్. శాస్త్రి, నేను బయలుదేరి శ్రీ సి. ఆర్. దాసు పత్రికకు కొంతద్రవ్యసహాయము కోరుటయే గాక ఉభయులమధ్య నొక సమావేశము సాగింప నిశ్చయించుకొంటిమిగాని నేను శ్రీ సి. ఆర్. దాసు