పుట:Sri-Srinivasa-Ayengar.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

104

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


గారిని వెంటఁబెట్టుకొని చెంగల్పట్టు, విళ్లుప్పురము కడలూరు వెళ్ళి అచ్చటనుండి శ్రీ అరవిందఘోష్‌గారి ఆశ్రమము చేరితిమి. అచ్చటనుండి చిత్తూరు, వేలూరుమున్నగు చోట్లు జూచుకొని బెంగుళూరునకు ప్రయాణమగునప్పుడు తంతె నిచ్చెద మని శ్రీరామదాసుగారితోను చెప్పిఁ చెంగల్పట్టు వెళ్లితిమి. మేము వెళ్లినచోట్లలో గొప్ప సభలు సాగుటయు కొంతసొమ్ము పత్రికకు లభించుటయు తటస్థించెను. చిత్తూరున న్యాయవాదిగనుండిన శ్రీ ఎమ్. రంగస్వామిఅయ్యంగారి ఇంటిలో మేము బసచేసి శ్రీ కట్టమంచి రామలింగారెడ్డిగారిని మమ్ముల కలుసుకొను మని నేను జూబు వ్రాసితిని. వారు చిత్తూరు క్లబ్బునకు త్వరలో వత్తు ననియు అచ్చట శ్రీ సి. ఆర్. దాసు గారి గౌరవార్డము అతిథి సత్కారముగావింప యత్నింతుననియు ఒక వెండిపళ్లెమునిండ మామిడిపండ్లనుంచి ఒకజాబు వ్రాసిపంపిరి. శ్రీ సి. ఆర్. దాసు, నేను చిత్తూరు మిత్రులు కొందరు క్లబ్బునకు వెళ్లగనే శ్రీ రెడ్డిగారు మిక్కిలి ప్రీతితో శ్రీ సి. ఆర్. దాసుగారిని కారునుండి దింపి క్లబ్బున సుఖాసీనుల గావించి పానీయముల ఫలహారముల వారికి తక్కిన మిత్రులకు నిచ్చి అందరిని సత్కరించిరి. మిత్రులు కొందరు