పుట:Sri-Srinivasa-Ayengar.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

105


టీపార్టీకాగానే బసలకు వెళ్లిరికాని శ్రీదాసుగారిని ఒక గదిలోనికి తీసికొనివెళ్లి పత్రికకు తాను హెచ్చుగ సొమ్ము ఇవ్వలేని స్థితిలో నున్నా నని రెండువందల రూపాయలనోట్ల మాత్రము నాచేతఁ బెట్టిరీ. చిత్తూరు క్లబ్బునుండి నేను శ్రీ దాసుగారిని శ్రీ మునుస్వామినాయుడుగారియింటికి తీసికొనివెళ్లగా శ్రీ దాసుగారిని ప్రీతిగౌరవములతో ఫలతాంబూల చందనాదులతో సత్కరించిరి. వచ్చినపనిని శ్రీనాయుడుగారితో చెప్పగ వారు విరాళముగ 150 రూపాయలు పత్రికకు నిచ్చిరి. వేంకటగిరిలో వేలకొలది ప్రజలు రైలుకు అడ్డపడి శ్రీదాసుగారిని సభలో సుషన్యసింపుమని మొండిపట్టు పట్టిరికాని ప్రజానీకవర్తనను శ్రీ సి. ఆర్. దాసుగారు గర్హించిరి. అల్లరిహెచ్చి పోలీసులు మే మున్నచోటికి వచ్చి మూకను వెళ్లగొట్టినమీదట మేము గూడూరుకు చేరుకొంటిమి. వేంకటగిరి ప్రజలకు శ్రీ రామదాసుగారిపై అనుమానము జనించి వీరే శ్రీ దాసుగారిమససును మార్చి రని తలచి కాబోలు వీరిపై రాళ్లు విసరిరి.

శ్రీ సీ. ఆర్, రెడ్డిగారు సాయంత్రము సభ ముగియగానే తనబసకు రమ్మని కోరిరి. 6 గం!! లకు ప్రారంభమైన సభ 9 గం|| వరకు సాగెను.