పుట:Sri-Srinivasa-Ayengar.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


కావున మాట తప్పరాదని రెడ్డిగారి బసకు వెళ్లితిమి. కాని వారు నిద్రించుచున్నందున మేము వేంకటగిరికి ప్రయాణము సాగించి 3 గం||లకు గూడూరు చేరితిమి. గూడూరున రాత్రి 3 గం!! గొప్ప సభను శ్రీ పెల్లేటి వెంకటసుబ్బారెడ్డిగారు సమావేశపరచి శ్రీదాసుగారిని సభలో ఉపన్యసింపుమని ప్రాధేయపడిరి. కాని ఉదయము 7 గం||కు . నెల్లూరు సభకు వెళ్లవలసి యున్నందువల్ల వేకువనే బయలుదేరి వెళ్లఁదలచితి మని వారితో చెప్పిన మీఁదట వారుగూడ మాతో నెల్లూరికి వచ్చిరి. వారు 116 రూపాయలు శ్రీ సి. ఆర్. దాసుగారికి నిచ్చిరి. మరికొందరు కొద్ది మొత్తముల మధ్య రాత్రివేళలో శ్రీ సి. ఆర్. దాసుగారిపై గల అభిమానముచే వారికి నిద్రాభంగము గావించి కొద్ది మొత్తముల నిచ్చి గౌరవించిరి. 4 గం||కు గూడురు వదలి 6.30 గ! నెల్లూరు స్టో౯హవుసుపేటలోని రేబాల వారి భవనమునకు వెళ్లి వాకిట కారు నిలిపి నేను లోపలికి వెళ్లి మిత్రులగు శ్రీ సుందరరామిరెడ్డితో శ్రీ సి. ఆర్. దాసుగారు వచ్చిరనియు వారు అతిథిగ నుందు రనియు చెప్పి, నేను, రెడ్డిగారు కారువద్దకువెళ్లి శ్రీ దాసుగారిని దిగఁబెట్టి ఇంటిలో