పుట:Sri-Srinivasa-Ayengar.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

107


ప్రవేశించితిమి. వెంటనే శ్రీ సి. ఆర్ . దాసుగారు కొంత కాఫీపుచ్చుకొని ఫలహారముల ముట్టకనే 4 కమలాఫలముల నారగించి నెల్లూరు సభకు బయలుదేరిరి. వేసవి కావున 7 గం!! ప్రారంభించిన సభను 9 గం|| పూర్తిగావించి కొంత వసూలైన సొమ్ముతో శ్రీ సుందరరామిరెడ్డిగారి భవనము చేరుకొంటిమి. నేను సి. ఆర్ . దాసుకు కావలసిన భోజనఏర్పాట్ల త్వరలో గావింపు మని సుందరరామిరెడ్డిగారితో చెప్పి వీరికారులో మాబావగారగు శ్రీకాళహస్తి దక్షిణామూర్తిగారింటికి వెళ్లి ఆచ్చట భోజనముచేసి గంటలోగా సి. ఆర్. దాసు బసలో కలుసుకొంటిమి. నెల్లూరు పురప్రముఖులగు శ్రీ ఆమంచర్ల కృష్ణరావు, శ్రీముంగమూరి సుబ్బారావు, శ్రీ టి. వి. శివరామయ్య, శ్రీ ఏనుగ రాఘవరెడ్డి, శ్రీ అణ్ణాస్వామిఅయ్యరు, శ్రీ చెంగయ్యపంతులు మున్నగువారికి వార్త పంపగా వీరందరును శ్రీ సి. ఆర్. దాసుగారి బసకు వచ్చి అందరు కొంతసొమ్ము విరాళముగ పోగుచేసి త్వరలో పంపెదమనియు శ్రీ రాఘవరెడ్డిగారు స్థానికపనుల నిర్వహింతు రనియు చెప్పినమీదట రేబాల వారి కారులో నేను, శ్రీ దాసుగారు కావలికి ప్రయాణము సాగించితిమి. కాని అచ్చట వెళ్లిన రోజుననే పనిముగించుకొని శ్రీ రామదాసు