పుట:Sri-Srinivasa-Ayengar.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


గారికి తంతెనంపి వెంటనే బెంగుళూరునకు రమ్మని కోరితిమి. శ్రీ దాసుగారు నేను బెంగుళూరు చేరుటకుముందే వీరు మైసూరు హోటలున బస కుదుర్చుకొనియుండిరి. శ్రీ దాసుగారి స్నానపానాదులకు అచ్చట అవకాశము తక్కువగా నున్నందున, దివా౯ వి. పి. మాధవరావుగారి భవనమునకు వెళ్లి వారి యింట, శ్రీ దాసుగారికి బస కుదిర్చితిని. నేను శ్రీదాసు బెంగుళూరువచ్చిన వర్తమానము శ్రీమా౯గారికి తెలిసి, మమ్ము వెదకుచు మైసూరు హోటలుకు వచ్చిరి కాని శ్రీ రామదాసుగారు ఆ హోటలుస రెండురోజు లుండుట కేర్పాటు కావించుకొనిరి. కావున నేను, శ్రీ వి. ఎల్. శాస్త్రి శ్రీమా౯గారి బంగాళాకు కారులో వెళ్లితిమి. శ్రీదాసుగారు యెచ్చట నున్నా రని నన్ను ప్రశ్నింపగా వారికి శ్రీ వి. వి. మాధవరావుగారితో బస కుదిర్చితి నని చెప్పితిని. అందువల్లనో ఏకారణమువల్లనో కాని నన్ను తన బంగళాలో బసచేయు మని కోరనందన సమీపమున నున్న శ్రీ అల్లాడి కృష్ణస్వామిగారి బంగాళాకు వి. ఎల్. శాస్త్రిగారును, నేనును వెళ్లి అచ్చట స్నానపానాదులు ముగించుకొని భోజనము చేసితిమి. భోజనము కాగానే శ్రీ వి. ఎల్. శాస్త్రిని శ్రీ దాసు గారివద్దకుఁబంపి, శ్రీ రామదాసుగారు నేను దివాను