పుట:Sri-Srinivasa-Ayengar.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

109


బహదూరు టి. రంగచారిగారిని సందర్శించి వారితో మాట్లాడి ఆ మీద శ్రీమా౯ గారి ఇల్లు చేరుకొంటిమి. శ్రీ టి. రంగాచారిగారు ఐదువందలు విరాళముగ శ్రీ దాసుగారి కిచ్చిరి. 3 గం|| మొదలు రాత్రి 8 గం|| వరకు నేను శ్రీ దాసుగారికి ఒక గొప్ప మొత్తమును యివ్వమని ఎంతచెప్పినను వినక రాత్రి 9 గం|| పిదప శ్రీదాసుగారిని తన బంగళాకు పిలుచుకొని రమని చెప్పిరి. విరాళముసంగతి వారితో చెప్పెదనన్న మీదట శ్రీరామదాసుగారు, నేను శ్రీదాసుగారి బసకు వెళ్లి బెంగుళూరున ఇద్దరు ప్రముఖుల సందర్శింపగా వారు చెరి వందరూపాయలు నిచ్చిరి. ఆమీద శ్రీ రామదాసుగారిని మైసూరు హోటలున దిగబెట్టి శ్రీ సి. ఆర్ . దాసుగారివద్దకువెళ్లి వారిని, వి. ఎల్. శాస్త్రిని వెంటఁబెట్టుకొని శ్రీమా౯గారి బంగళాకు వచ్చితిమి. శ్రీదాసుగారు యెట్టిఆహారము భుజింతురో ఆసంగతి కస్తూరితోచెప్పగానే పూరీ, పాయసము, బాదంహల్వా మున్నగుపదార్థముల సిద్ధముగావించెను. అన్నము, సాంబారుకలిపిన అన్నమును ఒక గిన్నెలో నుంచెను. అప్పడములు, పెరుగు, పొడి అన్నము, ఊరగాయలు మున్నగువానిని గూడ బల్లమీద నుంచెను. ప్రక్కన కుర్చీన శ్రీమా౯ గారు కూర్చొని శ్రీదాసుగారు ఆహారము