పుట:Sri-Srinivasa-Ayengar.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


పుచ్చుకొనుచుండగా మాట్లాడుటకు ప్రారంభించిరి. అప్పటికి దాదాపు 10 గం|| అయెను కావున, నేను వి. ఎల్. శాస్త్రి, శ్రీ అల్లాడి కృష్ణస్వామిగారి బంగళాకు తిండికై వెళ్లగా 8 గం||లోగా అందరు తిండి తిని పండుకొని రనియు, వంటమనిషి. కూడ వెళ్లె ననియు వాకిట నున్న జవాను చెప్పెను. ఆకలితోబాధపడుచున్న ఉభయులము మేము మరల సీ. ఆర్, గారి బంగళాకు రాగా శ్రీదాసుగారు బసకుబయలుదేరిరి. శ్రీమా౯గారు వారితో ఏమిచెప్పిరో శ్రీదాసుగారు మాతోఁజెప్పరెరి. కాని కొంతకాలమునకుగాని తాను స్వరాజ్యకక్షలో చేరుటకు వీలు కాదని చెప్పినట్లు పిమ్మట మాకు తెలిసెను. శ్రీదాసుగా రున్నచోట నిద్రించుటకు వీలుండెను కాని ఉదయమునుండియు ఇటూ అటూ తిరుగుటచే ఆకలి బాధించుచున్నందున శ్రీ వి. ఎల్'. శాస్త్రి, నేను శ్రీ అల్లాడి బంగళాకు వచ్చి కేకలు వేసి వాకిలితలుపులు తట్టగా కొంతసేపటికి శ్రీ కృష్ణస్వామిగారి భార్య వాకిలితలుపు తీసి మమ్ముల భోజనమైనదా అని ప్రశ్నించిరి. తిండితినలేదని యామెగారితో విధిలేక చెప్పవలసివచ్చెను. మేము పడకలపరచుచుండగా నామె వచ్చి తాను కొంత చారుఅన్నమును సిద్ధము గావింతునని చెప్పి రాత్రి