పుట:Sri-Srinivasa-Ayengar.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

111


12 గం|| మాఇద్దరికి అన్నము పెట్టినందున ఆ మీద నిదురపట్టెను. ఈదురవస్థకంతటికిని శ్రీమా౯ కారకులని శ్రీ వి. ఎల్. శాస్త్రి అల్లరి ప్రారంభించెను. వేకువను నాలుగుగంటలకు మే మిద్దరము లేచి నిత్యకృత్యముల తీర్చుకొనుచుండగా శ్రీకృష్ణస్వామిగారి వంటమనిషి కాఫీ తెచ్చియిచ్చెను. నేను త్రాగి శ్రీ సి. ఆర్. దాసుగారి బసకువెళ్లి వారిని వెంటబెట్టుకొని బెంగుళూరుసిటీ రైలుస్టేషనునకు కారు వదలు మని చెప్పుచు మార్గమున శ్రీ రామదాసుగారి హోటలు వద్ద ఆగి రైలుస్టేషను చేరినంతనే కారును వారికై పంపెద మని చెప్పితిమి. అందరము బెంగుళూరునుండి చెన్నపట్టణము చేరుకోగానే మరునాడు శ్రీ రామదాసుగారు తనబంగాళాలో శ్రీ దాసుగారి గౌరవార్థము గొప్పవిందు గావించి ప్రముఖులనేకుల నాహ్వానించిరి. విందుకాగానే అందరము శ్రీమా౯. ఏ. రంగస్వామి అయ్యంగారు బంగాళాకు 3 గం||కు వెళ్లితిమి. శ్రీరంగస్వామిఅయ్యంగారు శ్రీదాసుగారి గౌరవార్డము ప్రముఖులైన కొందరు ఆప్తులను మాత్రమాహ్వానించిరి. పార్టీముగియగానే వసూళ్ల లెక్కల సరిచూచుకోగా 30 వేలు శ్రీ దాసుగారికి ముట్టె నని ఏర్పడెను. నాటిరాత్రి యీసొమ్ముతో శ్రీ సీ. ఆర్. దాసుగారు మదరాసునుండి కలకత్తాకు