పుట:Sri-Srinivasa-Ayengar.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


ప్రయాణమైరి. శ్రీదాసుగారు ముందువెనుక లాలోచింపక తెలవనితలంపుగా బెంగళూరునుండి ప్రయాణమైనందుకు తనకాశ్చర్యము కల్గె నని శ్రీమా౯ చెప్పిరి. శ్రీ సి. ఆర్. దాసుగారిపై శ్రీమా౯ గారికెంత యభిమానముండెనో అంతయభిమానము శ్రీ సుభాషుచంద్రబోసుగారిపై నుండెడిది. వీరుభయుల గుణాతిశయములును స్వార్థత్యాగములఁ గూర్చి పలుమా రారోజులలో శ్రీమా౯ ముచ్చటించెడివారు. స్వరాజ్యకక్ష నిర్మాణముకాగానే శ్రీమా౯గారికిని శ్రీ గాంధీగారికిని మధ్య అభిప్రాయభేదములు ఏర్పడినందుకు కారణము లనేకములు గాని హిందూముస్లిములమధ్య సంధికుదుర్చుటకు శ్రీ దాసుగారికి తనకు తప్ప ఇతరులకు సాధ్యముగాదని శ్రీమా౯గారు శ్రీ గాంధీతో నిష్కర్షగా చెప్పిరి. ఒకప్పుడు ఆలీసోదరులు బ్రతికి యుండగా హిందూమహమ్మదీయుల మధ్య సంప్రతింపులు సాగింప వీరుప్రయత్నించిరి. వీ రప్పుడు శబర్మతీఆశ్రమమునకు వచ్చియుండిరి. రెండుమూడురోజులు సంప్రతింపులు సాగినమీదట సమావేశము ఏ తీర్మానమునకురాక సమాప్తమాయెను. రాజకీయవ్యవహారములలో భిన్నాభిప్రాయములు జనింపలేదు గాని, మసీదుల ముందు హిందువులు మేళము వాయింప రాదనియు