పుట:Sri-Srinivasa-Ayengar.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

113


బక్రీదునాడు పశువులనుచంపుటకు హిందువులు ఆటంకపరచరాదనియు ఆలీసోదరులు పట్టుపట్టిరి. శ్రీగాంధీగారు ముస్లిములకోరికను సఫలముగావింప సిద్దపడిరేకాని హిందువుల మనోభీష్టములను జార విడచిరి. కావుననే హిందూముస్లిములమధ్య సబర్మతీ ఆశ్రమములో సమైక్యత కష్టసాధ్యమాయె నని శ్రీమా౯గారు వెల్లడించిరి. నాడు ఏర్పడిన విభేదములవలన క్రమేణ కలతలు హెచ్చెను. కాని తా నేవిధముగనైన రాజీ కుదుర్చగలనని చెప్పినను శ్రీ గాంధీగారు ఇందుకు అవకాశ మివ్వరైరి. చట్టప్రకారము ఢిల్లీ అసెంబ్లీలో మహమ్మదీయులకు ఇవ్వబడిన స్థానములకన్న 5 స్థానములు హెచ్చుగ ఇప్పింపబడవలెనని ముస్లిములు చెప్ప సాగిరి. శ్రీమా౯గారు ముస్లీముల కోరికను సఫలముగావింప ఇష్టపడిరికాని శ్రీగాంధీగారు మరల అడ్డు తగిలిరి.

సంపూర్ణస్వరాజ్యము భారతీయుల ఆశయము కావున కాంగ్రెసు ఈకోరికకు అనుగుణముగ ఒక తీర్మానముగావించి ఇందుకై దేశమంతట ప్రచారము సాగింపవలెనని శ్రీమా౯గారు సూచించిన సూచనకు శ్రీగాంధీగారు సమ్మతింపరైరి.