పుట:Sri-Srinivasa-Ayengar.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


సర్కారు ఉద్యోగులను తమపనులు వదలుకొను డనియు, విద్యార్థులు కాలేజీ పాఠశాలలు బహిష్కరింపవలెననియు, న్యాయవాదులు కోర్టులకు వెళ్ల రాదనియు కాంగ్రెసు పలుమారులు తీర్మానించుటయు, ఆమీద దేశమంతట ప్రచారము సాగించుటయు పొరబాటని శ్రీమా౯గారు శ్రీగాంధీగారితో చెప్పిన దానిని వీడి వారు ఈమాటలను పెడచెవిన బెట్టిరి.

రాజకీయవ్యవహారములను మతసాంఘిక వ్యవహారములతో ముడిబెట్టినచో రెండు వ్యవహారములును పాడగునని శ్రీ శ్రీనివాసఅయ్యంగారు శ్రీగాంధీగారికి విస్పష్టపరచిరి. కాని శ్రీగాంధీఅహింసా ప్రచారమును ఎన్నడు మానననియు, తన అంతరాత్మ చెప్పినట్లు కాంగ్రెసు వ్యవహారములను తానే సాగింతుననియు శ్రీ అయ్యంగారితో చెప్పినందున ఉభయులకు ఎందున గాని సమ్మతి, అనుకూలముఏర్పడుట కష్టసాధ్యమాయెను. 1926 సం!!న గౌహతీ కాంగ్రెసునకు శ్రీమా౯గారు అధ్యక్షులుగ ఎన్నుకోబడిరి. ఈకాంగ్రెసు తీర్మానములను శ్రీమా౯ సిద్ధము గావించుచుండగా, శ్రీగాంధీగారివద్దనుండి వీరి కొకయుత్తరము వచ్చెను. ఇందు లోతుతెలియక ఏల నీళ్లలో శ్రీమా౯ దిగుచున్నారని గాంధీ హెచ్చరించెను. శ్రీమా౯గారు