పుట:Sri-Srinivasa-Ayengar.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

115


తన భార్యను పిలిచి శ్రీగాంధీగారి జాబును చదివి, మీదయ యున్నచో నేను నీళ్లలో మునగననియు, గట్టునకు తలచినపుడు రాగలననియు బదులువ్రాసిన జాబును చదివిరి. గౌహతీ కాంగ్రెసుకు శ్రీమా౯గారి కుమార్తె శ్రీమతి అంబుజమ్మాళ్ వత్తునని ప్రాధేయపడెను. కాని శ్రీమా౯ ఇందుకు సమతింపరైరి. 41 ఏనుగుల ఊరేగింపున శ్రీమా౯గారిని రైలుస్టేషనునుండి కాంగ్రెసు ఆవరణమునకు తీసికొని వెళ్లు ఏర్పాట్లు గావింపబడెను. కావున ఇన్ని ఏనుగులముందు శ్రీమా౯ ఒక ఏనుగుపై ఊరేగించు వైభవమును తాను తప్పక చూచితీరవలయునని ఆమె ఎంత ప్రాధేయపడినను శ్రీమా౯ వినరైరి. ఈలోగా స్వామి శ్రీ శ్రద్ధానందగారిని ఢిల్లీ నగరవీథిన ఒక తురకహంతకుడు కత్తితోపొడిచి చంపెనను వార్త శ్రీమా౯గారికి తెలియగానే గౌహతిలో ఏర్పాటైన ఏనుగుల ఊరేగింపును ఆపివేయుమని గౌహతీ కాంగ్రెసు కార్యదర్శులకు వీరు ఒక తంతెనంపిరి. శ్రీమా౯గారు తమకు లభించు కీర్తిని, గౌరవమును తమ కుటుంబమువారు తనివితీర అనుభవింపవలెనని భావించెడువారు కారు. చెన్నపట్టణములో సాగు సభలకు కూడ వీరు తమ ఇంటివారిని వెంటబెట్టుకొని