పుట:Sri-Srinivasa-Ayengar.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

116

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


వెళ్లెడువారు కారు. ఇంటివారు పైకి వెళ్లినచో ఇంటిపనులను క్రమేణ మానుదురనియు, ఇంటిలో దక్షతయుండదనియు చెప్పెడువారు. అట్లు చెప్పిసను ఇంటివారిపై వీరికి ఆపారప్రేమ గలదని ఇంటివారు, పైవారుగూడ గుర్తించిరి. ఇంటిలో నెవరికి జబ్బుచేసినను వెంటనే డాక్టరును పిలిపించి మందిప్పించి గంటకు 4, 5 సార్లు జబ్బెట్లున్నదని జబ్బుపడ్డవారిని ప్రశ్నించుచుందురు. శ్రీమా౯ సేలం విజయరాఘవాచారిగారు నాగపూరు కాంగ్రెసుకు అధ్యక్షులైనపుడు శ్రీమా౯గారిని తప్పక నాగపూరు రమ్మని కోరగా ప్రయాణమునకు సిద్ధ పడిరి. కారుమీద వంటమనిషి, గుమాస్తా శ్రీ రామచంద్రఅయ్యరు. సెంట్రలుకువెళ్లి సామానులుదింపి శ్రీమా౯గారికి సీటు రిజర్వుచేయుటకు యత్నించుచుండగా వీరి మనుమడు కృష్ణస్వామికి (శ్రీ అంబుజమ్మాళ్ కుమారుడు) నాటి ఉదయము జ్వరముతగిలి హెచ్చెను. సాయంత్రము డాక్టరు పరీక్షింపగా 1050 జ్వరమున్నట్లు వెల్లడియాయెను. వెంటనే టెలిఫోనున రామచంద్రయ్యరును సామానులతో వెనుకకు రమ్మనిచెప్పి కారెక్కి యకాయకిన డాక్టరును పిలుచుకొని వచ్చిరి. ఇంటి వా రెంత చెప్పినను ఏదియు వినక, కొంపమునిగెనని అరచు