పుట:Sri-Srinivasa-Ayengar.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

117


చుండిరి. డాక్టరు ఇచ్చుమందు ఎప్పటివలె పరిశీలించి ఆమీద మనుమనికి ఇచ్చెడివారు. తెలిసీ తెలియని వైద్యులు రోగికి ఆపాయము కలిగింతురని వీరి అభిప్రాయము కావున ఏడాక్టరు ఇంటికి వచ్చినను వారిని ఎన్నియోప్రశ్న లడిగెడువారు. ఎంత ప్రవీణుడైన డాక్టరైనను వీరు అడుగుప్రశ్నలకు తగు సమాధానము ఇవ్వనిచో వారితో గంటసేపు మాట్లాడిగాని డాక్టరును వదలెడివారు కారు. 1930.32 సం||లో శ్రీమా౯ కుమార్తె శ్రీ అంబుజమ్మాళ్ శ్రీగాంధీ కార్యక్రమమున పూర్తిగ పాల్గొనుచు, దూదేకుల మఠస్థులతోకలిసి ప్రచారము సాగించుచుండిరి కావున కుమార్తెతో ప్రీతితో మాట్లాడరైరి. కాని, కుమార్తె ఏఏ చోట్లకు వెళ్లుచున్నదో, ఏ ఏపనుల సాగించుచున్నదో మున్నగు వివరము లన్నిటిని భార్యనడిగి తెలుసుకొనుచుండిరి. కాని ఎన్నడైన కుమార్తె సమీపించినచో కండ్లు ఎఱ్ఱజేసికొని ముఖమును చిట్లించుకొనెడివారు. అప్పట్లో శ్రీ అంబుజమ్మాళ్ తండ్రిగా రున్న చోటికి వెళ్లుటకుగూడ భయపడుచుండెను. కుమార్తె జైలునకువెళ్లు రోజునగూడ తన ఉద్దేశమును శ్రీమా౯గారికిచెప్పలేదు. కాని కుమార్తెను పోలీసులు లాకపునకు తీసుకొనివెళ్లగానే శ్రీమా౯గారి మనస్సుకరగి