పుట:Sri-Srinivasa-Ayengar.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


వెంటనే పోలీసుకమీషనరు. ఆఫీసుకువెళ్లి కుమార్తెను చూచివచ్చిరి. ఆమీద శ్రీ అంబుజమ్మాళ్‌కు శిక్ష విధించి యామెను వేలూరుజైలుకు పంపుచుండగా మరల శ్రీమా౯గారు, వీరి భార్య మరల వెళ్లి కుమార్తెను జూచి వచ్చిరి. ప్రతివారము జైలు ఇంటర్వ్యూకు భార్యతో వేలూరునకు పండ్ల బుట్టలతో వెళ్లెడివారు. మొదటి ఇంటర్వ్యూన కమ్ములదాటి లోపలికి వెళ్లరాదని పోలీసులు అడ్డగించినందున ఇట్టి ఆటంకముల కల్పించినచో తాను కుమార్తెతో మాట్లాడకనే వెళ్లెదనని ప్రయాణమై చెన్నపట్టణము వచ్చిరి. రెండన ఇంటర్వ్యూకు శ్రీమా౯ వేలూరుజైలుకు వెళ్లగా ఇనపకమ్ములు. తీసివేసి నిరాఘాటముగ కుమార్తెదగ్గఱకువెళ్లి మాట్లాడుటకు జైలు అధికారులు అవకాశములు కల్పించిరి. 1927 సం|| మదరాసున కాంగ్రెసు సమావేశమును శ్రీమా౯గారు తమ యాజమాన్యమున మిక్కిలి వైభవముతో జరిపి చాల చోట్లకు వెళ్లి గొప్ప మొత్తమును పోగుచేయుటయేగాక సొమ్ము వృథాగా ఖర్చుగాని ఏర్పాట్లన్నిటిని చేయించిరి. వీరు మధుర, రామనాథపురము, కారైకుడి మున్నగు చోట్లలోఉన్న తమ కక్షిదారుల యిండ్లకు వెళ్లి