పుట:Sri-Srinivasa-Ayengar.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

119


కాంగ్రెసు ఖర్చులకు విరాళముల నిమ్మని కోరగా వారందరును కలసి 60 వేలు, వసూలుచేసి శ్రీమా౯గారి చేతి కందిచ్చిరి. భారతదేశమునకు సంపూర్ణ స్వరాజ్యమే అవసరమను తీర్మానము ఈ మదరాసు కాంగ్రెసున నెగ్గుటకు శ్రీమా౯గారే కారకులు. విరాళములవల్లను టిక్కెట్లు విక్రయించుటవల్లను దాదాపు 3 లక్షలకు పైగా సొమ్ము లభించెను కాన రెండులక్షలుమాత్రమే ఖర్చుబెట్టి తక్కిన సొమ్ముతో రాయపేటలో 10 నివేశనముల స్థలమును కొనిరి. ఆమీద సుప్రసిద్ధ ఇంజనీరును, మదరాసురాష్ట్ర మాజీ మంత్రియు నగు దివాన్‌బహదర్ ఆర్. ఎన్. ఆరోగ్యస్వామి మొదలారిగారిచే చక్కని ప్లాను తయారుచేయించి కాంగ్రెసు భవనమును చెన్నపట్టణమున నిర్మించి కాంగ్రెసునకు భవనములేదను కొరతను తీర్చిరి. దురదృష్టవశాత్తు 1939 సం||న ఈ భవనమున కాంగ్రెసు వస్తుప్రదర్శనశాల సాగుచుండగా ఎలెక్ట్రిక్ తీగలవల్ల మంటలు ప్రారంభమై యీ భవనము బూడిద పాలాయెను. ఈమదరాసు కాంగ్రెసు సమావేశమగుటకు కొన్నినెలలకు ముందే భారత స్వరాజ్యప్రభుత్వపు ఏర్పాట్లు ఏ తీరుగ నిర్మాణము కావలెనో సూచించుచు ఆ సూచనల నొక పుస్తకరూపకముగ ప్రకటించిరి. కాంగ్రెసు