పుట:Sri-Srinivasa-Ayengar.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


సాగిన పిదప 1928 సం!! ఏప్రెలు నెలలో శ్రీమా౯గారు ఐరోపాకు ప్రయాణమైరి. ఆస్ట్రియా, స్విట్జర్లండు, జర్మనీ, ఫ్రాంసు మున్నగు దేశములలో కొంతకాలము పర్యటించి ఆ మీద ఇంగ్లాందు చేరిరి. రష్యాలో వీరు మార్షల్ స్టాలిన్ అతిథిగ నుండిరి. మాస్కోనగరమున కొన్నిరోజులుండి ఆ నగరమందలి చూడదగిన ప్రదేశము లన్నింటిని చూచిరి. క్రెమ్లిను భవనముననే స్టాలిన్‌ను సందర్శించి రెండుగంటలు వారితో సంభాషించిరి. రూస్వెల్టు, చర్చిలు, స్టాలిన్ ముగ్గురును ఆరోజులలో అందరి దృష్టిని ఆకర్షించుచుండిరి. లండనున పార్లమెంటు సభ్యు లనేకులను కలసికొని అనేక రాజకీయవిషయములగూర్చి వారితో సంభాషించిరి. లండనునుండివెళ్లి వారి దేశస్వాతంత్ర్యమును సంపాదించిన డీవెలరా గారిని డబ్లినున సందర్శించి ఐర్లండున చూడఁదగిన చోట్లుచూచి ప్రజాసామాన్యము ఏస్థితిలో కాలము గడపుచున్నారో ఆ సందర్భములను గుర్తించిరి. శ్రీమా౯గారు ఐరోపా సంచారము ముగించుకొని స్వస్థలమునకు రాగానే సర్వపక్ష మహాసభ తీర్మాన ప్రకారము శ్రీమోతీలాలు శ్రీ నెహ్రూ సిద్ధము గావించిన ప్రణాళిక వెల్లడియాయెను. ఈ ప్రణాళి