పుట:Sri-Srinivasa-Ayengar.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

121


కలో తా నెంతోకాలముగ చెప్పుచుండిన అభిప్రాయములు కనబడకపోయినందున ఇకను హిందూ ముస్లిముల మధ్య సంధికుదురదని తలచి వీరు నిస్పృహులైరి. మదరాసు కాంగ్రెసున హిందూ ముస్లిముల మధ్య రాజీ కుదిర్చి ఉభయులకు సంతృప్తియగు కొన్ని తీర్మానములను శ్రీమా౯గారు నెగ్గించిరి. కలకత్తా ముస్లింలీగుకూడ మదరాసు కాంగ్రెసు కావించిన తీర్మానములకు సంతృప్తిగాంచెను. శ్రీనెహ్రూ ప్రణాళిక మదరాసు కాంగ్రెసుతీర్మానమునకు భిన్నముగ నుండుటయే గాక, శ్రీ జిన్నా ఆలీసోదరులు మున్నగు ముస్లిం నాయకు లందఱికిని అసంతృప్తిని గలిగించెను. కావున విభేదములు హెచ్చాయెను. ఈ కారణములచే కాంగ్రెసుపై శ్రీమా౯గారికి అసంతృప్తి హెచ్చెను. శ్రీనెహ్రూ ప్రక్కన శ్రీగాంధీకూర్చొని పక్షపాతబుద్ధితో పైతీర్మానములను నెగ్గించిరని శ్రీమా౯గారి దృఢాభిప్రాయము. 1928 సం!! కలకత్తాన సమావేశమైన కాంగ్రెసున పైవిషయముల గూర్చి దీర్ఘోపన్యాసముల గావించి మదరాసు తీర్మానములను శ్రీనెహ్రూ తన రిపోర్టున ఏతీరున దిగ ద్రొక్కిరో దానిని గూర్చి యుద్ఘాటించిరి. పరస్పర అభిప్రాయభేదములవల్ల కలకత్తా కాంగ్రెసున