పుట:Sri-Srinivasa-Ayengar.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


శ్రీగాంధీగారికిని, శ్రీమా౯గారికిని కలతలు హెచ్చాయెను. శ్రీగాంధీగారిని ధిక్కరించి శ్రీమా౯ చెన్నపట్టణము వచ్చిచేరిరి. చెన్నపట్టణమునకు రాగానే అనుచరులను ప్రోగుచేసి కాంగ్రెసునకు సంబంధపడినవారు, శ్రీనెహ్రూ రిపోర్టుకు ప్రతికూలురుఅగు అనేకుల సమ్మతితో కాంగ్రెసున నొక నూతసకక్షను లేవనెత్తిరి. ఈ కక్షకు శ్రీమా౯ అధ్యక్షులుగను, శ్రీ సుభాష్‌చంద్రబోసు కార్యదర్శులుగను యెన్నుకోబడిరి. నూతనకక్ష ఆదర్శమును, కార్యక్రమమును ఆలోచించి సిద్ధముగావించి వీరు ప్రకటించిరి. అన్ని పనులను మాని యీ నూతనకక్షకై రేయింబవళ్లు పాటుబడుటకు ప్రారంభించిరి. తనసేవ, స్వార్థ త్యాగముపడిన కష్టములన్నియు నేల పాలాయె ననియు, సంఘమునకుగాని, దేశముసకుగాని లాభము లేకపోయినదనియు, మిత్రులమని చెప్పు కొందరు నాయకులు కుట్రపన్ని వీరిపనులను చెడగొట్టిరనియు ఇకను కాంగ్రెసుననుండుట నిష్ప్రయోజనమనియు తలచి వీరు కాంగ్రెసుతో సంబంధము వదలుకొనిరి.

శ్రీమా౯గారు కాంగ్రెసును వదలిసమీదట శ్రీగాంధీగారు వీరియుపన్యాసములను, అభిప్రాయములను నిరసించుచు వీరి కొక జాబువ్రాయగా శ్రీమా౯