పుట:Sri-Srinivasa-Ayengar.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

123


గారికి కోపమధికమాయెను. కొందరు శ్రీగాంధీగారిని 'మహాత్మా' అని తలచువారు. కాని, డాక్టరు అనిబిసెంటు వారికి ప్రసాదించిన యీ బిరుదునకు వారు తగరని శ్రీమా౯గారు చెప్పుచు శ్రీగాంధీగారి వర్తననుగూర్చి బహిరంగసభలలో చర్చించుటకు ప్రారంభించిరి. శ్రీగాంధీ శాంతస్వభావు లని అనేకులు భావించినది పొరబాటని పై సందర్భమున రూఢి యాయెను. పనికిమాలిన పైజాబును శ్రీగాంధీగారు వ్రాయనిచో శ్రీమా౯గా రెన్నడును కాంగ్రెసును వదలరని నేనేగాక యింకెందరో అభిప్రాయపడితిమి. తా మేకారణములవల్ల కాంగ్రెసును వదలిరో ఏకరుబెట్టుచు 1930 సం||న శ్రీమా౯గారు ఒక ప్రకటన గావించిరి. శాసనోల్లంఘన తీర్మానమును ప్రతిపాదించుటకు కొన్నినెలలకు ముందే నేను కాంగ్రెసును వదలి పెట్టితిని కావున ఇందుకు కారణము క్రింద వివరించెదను:-

“నేను ప్రతిపాదించిన హిందూ ముస్లిము ఒడంబడికను, నేను మదరాసు కాంగ్రెసుస నెగ్గించిన సంపూర్ణ స్వరాజ్య తీర్మానమును కాంగ్రెసును, శ్రీగాంధీ, శ్రీనెహ్రూగారలు దిగద్రొక్కుటవల్ల వీరుభయులు కాంగ్రెసు వర్కింగుకమిటీ సభ్యులుగా నుండుట