పుట:Sri-Srinivasa-Ayengar.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


వల్లను వీరితో గలిసిపనిచేయుటకు నే నెన్నడును ఇష్టపడను. తిరునల్వేలిజిల్లా తిరుక్కురుంగుడిలోను, లాహోరు కాంగ్రెసునను పై సందర్భములను నేను నిరాఘాటముగ వెల్లడించుటయేగాక మరికొన్ని చోట్లలోను, స్వదేశమిత్ర౯ కార్మికుల సంఘుసమావేశమునను నేను నా అభిప్రాయములను వెల్లడించితిని. శ్రీగాంధీగారి కక్షవారికిని, నాకును సంబంధము లాహోరు కాంగ్రెసులోనే వదలి మేము దూరమైతిమి.” శ్రీమా౯గారికి శ్రీగాంధీగారి రాజకీయ కార్యక్రమముపై నమ్మకము లేకున్నను, శ్రీగాంధీగారి అహింసా సిద్ధాంతమును తన జీవితమున ఆచరణలో పెట్టుటకు అంతరాత్మ సూచించినట్లు ఆవరకు శ్రీమా౯ తలచిరి కాని తాను పొరబాటు పడితినని వెల్లడించిరి. శ్రీగాంధీగారి నిజస్వరూపమును తెలుసుకొనలేక చెన్నపట్టణమున స్వదేశీ లీగును నిర్మించి కొంత సొమ్మును వెచ్చించుటయేగాక శ్రీమా౯గారి కుమార్తె అంబుజమ్మాళ్, మరి కొందరు స్త్రీలు పాటుబడుచుండిరి. కాని యెన్నడును తన కుమార్తె అంబుజమ్మాళ్ సాగించు శ్రీగాంధీగారి కార్యక్రమమునకుగాని కృషికిగాని శ్రీమా౯ అడ్డము తగిలినవారుకారు. పనికిమాలిన ఉపన్యాసములను సభలలో సాగించి కారాగారము ప్రవేశింప