పుట:Sri-Srinivasa-Ayengar.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

125


వద్దని ఆప్పుడప్పుడు కుమార్తెను హెచ్చరించు చుండిరి. శ్రీ అంబుజమ్మాళ్ వేలూరు జైలునుండి విడుదల అయినదిమొదలు శ్రీగాంధీగారితో ఉత్తర ప్రత్యుత్తరములు సాగించుచుండిరి. వార్ధా ఆశ్రమమునకువెళ్లి శ్రీగాంధీని సందర్శించి వారితో కొంతకాలము ఆశ్రమమున నుండుటకు అనుమతి సంపాదించిరి. శ్రీగాంధీగారు హరిజన ప్రచారమునకై చెన్నపట్టణము వచ్చినప్పుడు అంబుజమ్మాళ్ వారిని సందర్శించి వారిని తసయింటికి వెంటబెట్టుకొని వచ్చిరి. వీ రుభయులు సంభాషించినపుడు ఇదివరలో, వీరి మధ్య జనించిన అభిప్రాయములను మాత్రము శ్రీగాంధీగాని. శ్రీమా౯ గాని మార్చుకొనరని నిష్కర్షగ వెల్లడియాయెను. పరస్పర క్షేమలాభముల గూర్చియు, పనికిమాలిన ఇతర సందర్భముల గూర్చియు మాట్లాడిరి కాని ఉభయులమధ్య చీలిక ఏర్పడినందుకు విచారపడిరి.

శ్రీమా౯ కుమార్తె కొంతకాలము శ్రీగాంధీగారివద్ద ఆశ్రమమున వాసముండవలెనని నిశ్చయించుకొనిరి. ఈమె బొంబాయి కాంగ్రెసుకు వెళ్లినపుడు శ్రీగాంధీగారిని సందర్శించి వారి ఆశ్రమవాసిగా కొంతకాల ముండుటకు అనుమతిని సంపాదించిరి. శ్రీ అంబుజమ్మాళ్ తన నగలన్నిటిని శ్రీగాంధీగారికి