పుట:Sri-Srinivasa-Ayengar.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


అందించి వీని విక్రయమువల్ల లభించు సొమ్మును ఆశ్రమ ఖర్చులకు వినియోగించుకొమ్మని చెప్పిరి. ఈనగల ఖరీదు ముప్పదివేలుండుని నేను వింటిని.

ఇంటికి రాగానే తండ్రిగారగు శ్రీమా౯తో పై సందర్బమును చెప్పినప్పుడు వీరు చాల కోపపడి శ్రీ అంబుజమ్మాళును వాగ్దాకు వెళ్లరాదనిరి. కొన్ని రోజులు తిండి తినక మొండిపట్టు పట్టినమీదట కుమార్తెను శ్రీమా౯ గారే వెంటబెట్టుకొని వార్ధా వెళ్లి శ్రీ గాంధీగారికి ఆమెను అప్పగించిరి. శ్రీగాంధీగారికిని, శ్రీమా౯గారికిని కొంతకాలము వైషమ్యములు ఏప్పడియున్నను, శ్రీగాంధీగారు శ్రీమా౯గారిని ప్రీతితో దగ్గరకు పిలచి, కూర్చొమ్మని చెప్పి మిక్కిలి మర్యాదతో వీరితో సంభాషించిరి. మరునాడు శ్రీమా౯గారు చెన్నపట్టణమునకు ప్రయాణమగుచు కుమార్తెను చూచి కంటతడిబెట్టుకొనిరి. కుమార్తె తన ఆరోగ్యమును కాపాడుకొనశక్తిలేనిదనియు, శ్రీగాంధీగారే ఆమెకు అన్నివిధముల సహాయపడవలెననియు చెప్పి రైలు స్టేషనుకు ప్రయాణమైరి. 45 రోజులు శ్రీ అంబుజమ్మాళ్ వార్ధా ఆశ్రమమున నుండిరి. అప్పుడప్పుడు శ్రీమా౯గారు శ్రీగాంధీకిని, కుమార్తెకును జాబులు వ్రాయుచుండిరి. వీరి జాబులకు బదులుగా శ్రీగాంధీ