పుట:Sri-Srinivasa-Ayengar.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

127


గారు “మీ రెంతమాత్రము విచారపడ నక్కర లేదు. నేను శ్రీ అంబుజమ్మాళును జాగ్రత్తగా చూచుకొనుచున్నాను. త్వరలో ఆమెను తమ వద్దకు పంపెదను.” అని జాబువ్రాసిరి. కాని ఈలోగా తొందరపడి శ్రీమా౯ గారు తన భార్యను వార్ధాకు బంపి కుమార్తెను పిలుచుకొని రమ్మని ఆదేశింపగానే శ్రీగాంధీగారు అంబుజమ్మాళును బంపివేసిరి. ఆమె మరి కొన్ని రోజులు ఆశ్రమమున నుండతలచితినని శ్రీగాంధీగారితో చెప్పగా ఇందుకు వారు ఆవకాశ మివ్వరైరి. కుమార్తె శ్రీమా౯ గారివద్దకు వచ్చిన కొన్నిరోజులకు ఈ క్రిందిజాబును శ్రీగాంధీగారు వ్రాసిరి.

"తమ జాబందినది. మీ కుమార్తె నావద్ద కొన్ని రోజు లున్నందుకు తాము, తమభార్య సంతృప్తి చెందినందుకు కృతజ్ఞుడను. అంబుజమ్మాళ్ ఆశ్రమమున నున్నపుడు అన్ని విధముల ఆమె కాలము వ్యర్ధము కాని మార్గమున గడపునట్లు చేసితిని. ఈమె ముందుకూడ కొంతకాలము శ్రద్ధతో ప్రజాసేవ సాగించునని, ఆశించుచున్నాను.”

శ్రీమా౯ ఎస్. శ్రీనివాసఅయ్యంగారు నిరంతర సేవవల్ల వేలకొలది భారతీయుల దృష్టిని ఆకర్షింప గల్గిరి, ప్రజాసేవలో స్వార్ణమునకు చోటులేదని