పుట:Sri-Srinivasa-Ayengar.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

128

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


గుర్తెరిగిన మహనీయుడీయన. వీరి దేశభకి, వీరి తెలివితేటలు, వీరి తీక్ష్ణ విమర్శనాశక్తి, అకుంఠిత ధైర్య సాహసములు, నిరంతర కార్యదీక్ష ఇతరులయందు కనబడవు. వీరి కుటుంబమువారిపైనే గాక మిత్రులపై వీరికున్న ఆదరణ అపరిమితము, ప్రశంసనీయము. పరోపకారులును, ఉదారులును అగు ఈ గొప్ప వ్యక్తితో కొంతకాలము సహచరుడనుగా నున్నది నా మహాభాగ్యమని తలచుచున్నాను. 1929 సం!! శ్రీమా౯గారు కాంగ్రెసుతో సంబంధము వదలుకొన్నది మొదలు బంగళావదలి ఎచ్చటికి వెళ్లువారు కారు. ఉదయము 6 గంటలకు నిద్రలేచి, అదిమొదలు 9, 10 గంటలవరకు ఇంటికి వచ్చిన వారితో సంభాషించుటయు, ఆమీద పైకి వెళ్లుటయు వీరి పూర్వపు అలవాటు. ఆరోజులలో రేయింబవళ్లు ప్రజాసేవయందే మగ్నులై యుండిరి. ఇట్టివారు రేయింబవళ్లు డ్రాయింగు రూమునందలి పడక కుర్చీన ఆసీనులై గంథావలోకనమునందే కాలము గడపుట ఇంటివారికే గాక పైవారికి ఆశ్చర్యము గలిగించెను. వర్షము తగ్గినను దుమారము తగ్గలేదని కొందరు చెప్పినట్లు వీరు కాంగ్రెసును వదలినను ప్రతీరోజు ఎందరో కాంగ్రెసువాదులు వీరివద్దకు వచ్చుచుండిరి. వీరు కాంగ్రెసున స్వతంత్ర కక్షను లేవ