పుట:Sri-Srinivasa-Ayengar.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

129


నెత్తినపుడు వందలకొలది జనము వీరివద్దకు వచ్చెడివారు. కాని నగరమున ఒక అంధకారము ఆవరించె నని వీరి అనుచరులు చెప్పెడివారు. కాంగ్రెసు వ్యవహారములలో నాయకత్వము వహింపుమని ఎందరో ప్రాధేయపడిరి కాని శ్రీగాంధీగారి కాంగ్రెసున తాను యెన్నడును జేరననియు, తాను సాగించిన పనులన్నిటిని వారు మట్టిపాలు గావించిరనియు బదులు చెప్పెడివారు. తాను మాత్రము కాంగ్రెసునకు విరుద్ధముగ నెన్నడును వర్తింపసనియు, దేశమునకు స్వాతంత్ర్య మత్యావశ్యకము గావున దానిని సాధించుట తన ఆశయమనియు చెప్పెడివారు. ఉత్తర హిందూస్థానమువారు దక్షిణదేశపువారిని ఒక మోస్తరుగ క్రిందిచూపుతో జూచుచున్నారు గావున, దక్షిణ ఇండియాన యెన్నియో సమస్యలు పరిష్కారము కావలసి యున్నవనియు దక్షిణ వాసులు స్వతంత్రించి కృషిచేయుట యావశ్యకమనియు శ్రీమా౯గారు చెప్పెడివారు. శ్రీ సరోజినీదేవి, శ్రీ జవాహర్లాల్ నెహ్రూ, శ్రీ రాజేంద్రప్రసాద్ గార్లు మదరాసుకు వచ్చినప్పుడు శ్రీమా౯ గారిని వీరి బంగళాలో సందర్శించి రెండు మూడు గంటలు వీరితో సంభాషించిరి. ఎటులైన వీరిని