పుట:Sri-Srinivasa-Ayengar.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

130

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


కాంగ్రెసున మరల ప్రవేశపెట్టుటకు తీవ్రప్రయత్నము కావించిరి కాని ఆప్రయత్నము నిష్ఫల మాయెను. అందుచే వీరి అనుచరులగు శ్రీ కె. భాష్యముగారు శ్రీమా౯గారితో సంప్రతింతు నని వారితో చెప్పిరి. కాని భాష్యముగారి మాటలను శ్రీమా౯గారు పెడచెవిని బెట్టిరి.

శ్రీమా౯ మరల కాంగ్రెసున ప్రవేశించనందుకు ప్రబలమైన కారణము లనేకములు గలవు. జాతీయవాదు లనేకులును హిందువులేగాక ముస్లిములు గూడ ఆశించినట్టి సంపూర్ణస్వరాజ్య తీర్మానమును కాంగ్రెసున వీరు నెగ్గించుటయేగాక అనేకసార్లు తిరిగి ప్రచారముగూడ సాగించిరి కావున వీరి సంవత్సరపు కృషి, విఫలమగుట ఒక కారణము. నిజముగా తన్సు, తన ఆదర్శములను ఆదరించునట్లు పైకి కనబడుచు లోలోపల శ్రీగాంధీగారిని బలపరచుచు కొంద రుండుట రెండవకారణము. కాంగ్రెసున క్రింద మీదబడి శ్రీగాంధీగారు తనమాట చెల్లునట్లు చేసికొనిరే కాని వారివలెవర్తించుటకు తనకు సాధ్యము కాకపోవుట మరొక కారణము. వయస్సు హెచ్చుటయు, అపార ఆదాయము తగ్గుటయుకూడ శ్రీమా౯ మరల కాంగ్రెసులో చేరకపోవుటకు