పుట:Sri-Srinivasa-Ayengar.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

131


కారణములుగ నుండవచ్చును. చాలకాలము వీరితో సంబంధపడియుంటిని గావున వీరి పట్టుదల, మొండితనము మొదలగుసవి స్వాభావికము లని నేను గుర్తింపగలిగితిని. వీరు తా ననుకొన్న పనిని ఏవిధముగనైన చక్కబెట్టినగాని, తానేగాక యితరులను గూడ నిద్రపోనివ్వనివారని చదువరులు గుర్తింపవలెను. కాంగ్రెసును వదలినను ఆఖరువరకు రాజకీయములలో అభిరుచిని వీరు వదలలేదు. రాత్రులలో మదరాసు ఆక్టింగు ప్రధానన్యాయమూర్తియగు శ్రీ వేపా రామేశం, న్యాయమూర్తి శ్రీ ఎమ్. పతంజలి శాస్త్రి మున్నగువారు కొందరు వచ్చి వీరు వెలిబుచ్చు అమూల్య రాజకీయాభిప్రాయములను తెలిసికొనుచుండెడివారు. శ్రీ పతంజలిశాస్త్రిగారు కొంతకాలమునకు ఢిల్లీ సుప్రీంకోర్టున ప్రధానన్యాయమూర్తిపదవిలోనుండగల్గిరి. కావున నిట్టివారు శ్రీమా౯గారి సునితాభిప్రాయములను గుర్తించుటకు యత్నించుటవల్ల శ్రీమా౯ అపార మేధావి అని ఏర్పడుచున్నది. ఒక్కొక్కప్పుడు వీరు ఇంటివారితోను, మిత్రులతోను అంతములేని సంవాదములను సాగించెడువారు కాన ఎన్నడు వీరితో సంభాషింప ఎవరికిని వీలుగాకయుండెడిది. 1930 సం|| ఆఖరున