పుట:Sri-Srinivasa-Ayengar.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


మదరాసు విక్టోరియాపబ్లిక్ హాలులో శ్రీ సేలం విజయరాఘవాచారిగారి ఏబది సంవత్సరముల ప్రజాసేవను కీర్తించుటకై కొందరు ఒక మహాసభను ఏర్పాటుగావించి శ్రీమా౯గారిని ఆ మహాసభకు అధ్యక్షులుగ నుండమని కోరగా వీరందుకు అంగీకరించిరి. నాడు అధ్యక్షులకు సభానంతరమున వందనములు సమర్పించుచు మాజీ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ వి. వి. శ్రీనివాసఅయ్యంగారు, ఇకముందు మైలావూరుస శ్రీమా౯గారు ఒక సన్యాసివలె యెందున జోక్యము కలిగించుకొనక కలకాలము గడపరాదనియు, మరల ముందు నిలచి దేశసేవ పూర్తిగా కొనసాగింపవలయుననియు చెప్పిరి. సభ్యులందరు జయ జయధ్వానముల సాగించుచు శ్రీమా౯ వి. వి. శ్రీనివాసఅయ్యంగారి కోరికను తప్పక సఫలము చేయవలెనని ఘోషించిరి. అప్పుడు గూడ శ్రీమా౯గారి మనస్సు మారలేదు గాని 1939 సం!! న మరల పౌరులు ఒక మహాసభను గానించి శ్రీమా౯గారిని నాయకత్వము వహింపు మని ప్రార్థించిరి. స్వదేశమిత్ర౯ పత్రికాధిపతి శ్రీ సి. ఆర్ . శ్రీనివాస౯గారు, ఈ రోజులలో వానప్రస్థాశ్రమమును ఆచరణలో