పుట:Sri-Srinivasa-Ayengar.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

133


పెట్టువా రెవరులేరనియు, శ్రీమా౯గారు తమ ఉన్నతస్థానమును వెంటనే ఆక్రమింపవలయుననియు సభలో వెల్లడించిరి. ఆమీద ఉపన్యాసము గావించిన శ్రీ కల్యాణసుందరమొదలియారేగాక మరికొందరు ప్రముఖులుగూడ పై అభిప్రాయములనే సూచించిరి. శ్రీమా౯గారు పరిస్థితులను పరిశీలించి ఎన్నడు తనకు ప్రజాసేవ సాగింపవలెనని తోచునో అప్పుడు తాను వచ్చెదనని ఒక ప్రకటన గావించిరి. ఈ ప్రకటనయేగాక పత్రికలలో రోజూ వీరు వ్రాసిన వ్యాసములు ప్రచురణ మగుచుండెను. ఈవ్యాసము లందలి నూతనాదర్శము లన్నియు ప్రజలదృష్టి నాకర్షించి వారిని ఉత్సాహపూరితులను గావించుచుండెను. కాంగ్రెసు మంత్రులను, వారి చర్యలను తీవ్రముగ ఖండించుచు ఉపన్యాసముల గావించుటయేకాక పత్రికలలో గూడ కాంగ్రెసు మంత్రులను తీవ్రముగ విమర్శించుచుండిరి. వేసవిలో వీరితో నేను కొడై కెనాలుకు వెళ్లియుంటిని. హైదరాబాదు నందలి సుప్రసిద్ద బారిష్టరును, రాజకీయ వేత్తయు నగు అక్బరు ఆలీఖానుగారు శ్రీమా౯గారిని సందర్శించుటకై కొడై కెనాలు వచ్చిచేరిరి. శ్రీమా౯గారితో కొన్ని గంటలు సంభాషించిన