పుట:Sri-Srinivasa-Ayengar.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

134

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


మీదట ఉభయుల మధ్య హిందూముస్లిము సమస్యనుగూర్చి ఒక ఒడంబడిక కుదిరెను. ఉభయుల సంతకములతో ఆ ఒడంబడికను వెంటనే పుస్తకరూపుమున ప్రచురించిరి. ఇండియా ప్రభుత్వమునందును, రాష్ట్రప్రభుత్వములయందును మంత్రులసంఖ్య సరిసమానముగ నుండవలెనని అందు సూచింపబడెను. అనగా హిందువు లెందరో ముస్లిము లందరు మంత్రులుగా నుండుటకు శ్రీమా౯గారు సమ్మతించిరి. శాసనసభ్యులుగా ఎన్నుకోబడినవారే మంత్రులను ఎన్నుకోవలెనని శ్రీమా౯గారి నిశ్చితాభిప్రాయము. శాసనసభ్యులు సాధారణ ప్రజా ప్రతినిధులు గావున వారిలో అధిక సంఖ్యాకులు మంత్రి పదవులలో సగము ముస్లిముల కిచ్చుటకు ఇష్టపడినచో దీనికి ఎవరును ఆటంకము చెప్పరాదని పై పుస్తకమున వ్రాయబడెను. హిందువులుగాని, ముస్లిములుగాని ప్రత్యేక రాజకీయసభల నిర్మింప రాదనియు, సైన్యమునగూడ పదవులు సగము మహమ్మదీయుల కిచ్చుటకు శాసనసభ్యులు ఇష్టపడినచో ఈ కోరికనుగూడ ఆచరణలో బెట్టవలెననియు మరొక సూచన కావింపబడెను. ఈపై ఒడంబడికను ప్రజలందరు ఆదరించినచో మహామ్మదీయులు