పుట:Sri-Srinivasa-Ayengar.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

135


పాకిస్థా౯ నిర్మాణ ప్రయత్నమును వదలుకొందు రని శ్రీమా౯గారు అప్పుడు భావించిరి. ఈ ఒడంబడికను ప్రచురించిరేగాని శ్రీమా౯గారు ఇంటినుండి కదలకుండిరి. ఎందరో వీరిని సందర్శించుటకు వచ్చినపుడు పై ఒడంబడికకై దేశమంతట ప్రచారము సాగింపమని ప్రోద్బలపరచిరి కాని వీరు కదలరైరి. వీరికిరాజకీయములలో నున్న అభిరుచి న్యాయవాదవృత్తిలో లేనందున కోర్టుకు వెళ్లరైరి. భారతరాజకీయ పరిస్థితులనుగూర్చి తానొక గ్రంథమును ప్రచురింపదలచి ఎక్స్‌ప్రెసు పత్రికలో తన ఊహలు వెల్లడించుచు రోజూ ఒక వ్యాసము ప్రచురించుచుండిరి. గ్రంథావలోకనమువల్ల సోమరితనము హెచ్చగు చున్నదని తలచి కాబోలు హెన్రీ మెయి౯ రచించిన 'హిందూలా' గ్రంథమును 'హిగి౯ బాదమ్' కంపెనీవారికి సవరించి యిచ్చుటకు సమ్మతించి, ఆ పనిని సంవత్సర కాలములో పూర్తిగావించిరి. దీనివల్ల భారతదేశమందేగాక విదేశములందు గూడ వీరి ప్రతిభ వెల్లడి యాయెను. అప్పట్లో 'ఫార్వర్డు బ్లాకు'ను నిర్మించుటకు శ్రీ సుభాష్‌చంద్రబోసుగారు చెన్నపట్టణమునకు వచ్చి శ్రీమా౯గారిని సందర్శించిరి. ఈ బ్లాకున