పుట:Sri-Srinivasa-Ayengar.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

136

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


చేరి నాయకత్వము వహింపవలెనని భక్తి పురస్సరముగ శ్రీ శ్రీనివాసఅయ్యంగారును శ్రీబోసుగారు ప్రార్థించిరి. రాజకీయములలో పూర్వము తనకున్న ఉత్సాహము ఇప్పుడు లేదనియు, ముందువలె శ్రమపడి ప్రచారము సాగించుటకు శక్తి, ఓపిక లేవనియు, ఇట్టి స్థితిలో తాను నాయకుడుగా ఏర్పడినచో నూతన కక్షకు యేమాత్రముబలము చేకూరదనియు వీరు శ్రీ సుభాష్‌గారితో చెప్పిరి. కాని శ్రీసుభాష్ కోరిక ప్రకారము తాను త్రిపురా కాంగ్రెసుకు తప్పకవచ్చి శ్రీబోసుగారి కన్నివిధముల సహాయము గావింతునని మాట యిచ్చిరి. కాంగ్రెసున ఆరోజులలో శ్రీగాంధీగారే గాక శ్రీ రాజేంద్రప్రసాదు, శ్రీ వల్లభాయి పటేలు, శ్రీ రాజగోపాలాచారి మున్నగు వర్కింగు కమిటీ సభ్యులుకూడ శ్రీసుభాష్ గారికి ప్రతికూలురుగ నుండిరి. శ్రీ సుభాష్‌బోసు అధ్యక్షతను శ్రీగాంధీగారి అనుచరులలో ఒకరు 'తూటుపడిన పడవ' అని చెప్పసాగిరి. ప్రముఖులు ఈ వైఖరితో వ్యవహరించు స్థితిలో అనుచరుల అభిప్రాయములనుగూర్చి ఏదియు చెప్ప వీలుగాక యుండెను. శ్రీ సుభాష్ చంద్రబోసుగారి జబ్బు హెచ్చినందుచే వీరు దేశమంతట సంచారము