పుట:Sri-Srinivasa-Ayengar.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

137


గావించి తన కక్షను బలపరచుకొనుటకు అవకాశము లేకపోయెను. కాంగ్రెసువాదుల ప్రవర్తన అసహ్యము పుట్టించెను. కావున భారతదేశమునకు త్వరలో సంపూర్ణ స్వరాజ్యము లభింపదని తలచి శ్రీమా౯గారు చెన్నపట్టణమునకు మరలిరి. 1939 సం!!న యుద్ధము ప్రారంభ మాయెను. ఈ యుద్ధమున ఇండియాకు గూడ ఎన్నడును లేని విపత్తు సంభవించునని శ్రీమా౯గారు భావించిరి. రోజూ కొంతసేపు రేడియోవద్ద కూర్చొని యుద్ధవార్తల నన్నింటిని గుర్తించి వానిపై తన అభిప్రాయములను ఇంటికీ వచ్చినవారితో చెప్పుచు త్వరలో ఇండియా అధోగతిపాలగునని చెప్పుచుండెడివారు. కాంగ్రెసు జాతీయసైన్యమును నిర్మించుట ఆవశ్యక మని తానెంతోకాలముగ చెప్పుచుంటిననియు, జర్మను ఢాకకు ఎదుర్కొన భారతీయులకు వీలుకాదు కాన అందరును శరణాగతిజొచ్చుట తప్ప గత్యంతరము లేదనియు చెప్పుచుండిరి. కొందరు అనుచరులు ప్రోద్బల పరచగా గొప్ప సభలలో వీ రుపన్యసించుచు పై స్వీయాభిప్రాయములను వెల్లడించిరి. 1941 సం|| ఏప్రెలు మాసప్రారంభమున వీరు కొడైకెనాలుకు