పుట:Sri-Srinivasa-Ayengar.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

138

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


ప్రయాణమైరి. నన్నును అచ్చటికి రమ్మనికోరిరి. కాని నేను అంతకుముందే రెండవక్లాసు రైల్వే కౌపనులను కొనియుంటిని గావున వెంటనే నేను ఒక దూర ప్రయాణము వెళ్లి రానిచో కౌపనులు నిరుపయోగ మగునని చెప్పి హుబ్లీమీదుగా బెంగుళూరు వెళ్లితిని. అచ్చటనుండి 'వైట్ ఫీల్డు'కువెళ్లి, అచ్చట రెండుమూడురోజులుండి మదరాసు చేరుకొంటిని. శ్రీమా౯గారు కొడైకెనాలులో జ్వరము తగిలి బాధపడుచు ఇంటికి పిలచుకొనివచ్చిరని తెలిసి వారినిచూచుటకై మైలాపూరుకు వెళ్లితిని. శ్రీమా౯గారు అదివరకు ఎన్నడును ఒంటరిగ కొడైకెనాలు వెళ్లినవారు కారు. ఎన్నిమందు లిచ్చినను జ్వరము తగ్గనందున డాక్టర్లు శ్రీమా౯గారిని మదరాసుకు పిలుచుకొని వెళ్లమని తంతె ఇవ్వగా వీరి కుమార్తె శ్రీఅంబుజమ్మాళ్ వెంటనే కొడైకెనాలు వెళ్లి వీరిని చెన్నపట్టణమునకు తీసికొనివచ్చిరి. వంటమనిషి కస్తూరి గూడ వీరితో ప్రయాణమాయెను గావున 8 గంటలలోగా శ్రీమా౯ గారు "అంజద్ బాగు” బంగళాన వచ్చిచేరిరి. వీరిని చూచుటకువెళ్ళిన నాలుగైదు రోజులకు ముందే వీరు చెన్నపట్టణమునకు