పుట:Sri-Srinivasa-Ayengar.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

139


వచ్చిరనియు, జ్వరబాధ తగ్గనందున పడకలో నుండియే తాను తలచిన ఏర్పాట్లన్నియు గావించిరనియు శ్రీమా౯గారి అల్లుడు నాతోచెప్పి నన్ను శ్రీమా౯గారివద్దకు తీసికొని వెళ్లెను. అనుకొన్న పనులన్నియు. పూర్తిచేసితిననియు, దేహయాత్ర, చాలించుటకు, సంసిద్ధముగ నున్నాననియు చెప్పుటకు ప్రారంభింపగానే వీరి కుమార్తె, భార్య మున్నగువారు భయపడవలసిన అవసరము లేదని యెంత చెప్పినను వినరైరి. అయిదారు రోజులుగా భగవద్గీతలోని 12.వ అధ్యాయమును చదువుమని యెవరితోనైనచెప్పి వారు చదువుచుండగా ఆశ్లోకములను వినుచుండెడివారు. తనకు ఇక ఏచికిత్స గావింపరాదని నిష్కర్షగా కుటుంబమువారితో చెప్పిరి. వారు గొప్ప డాక్టర్లను రప్పింపగా శ్రీమా౯గారు. డాక్టర్లతో "నాకు ఇకను జీవింపవలెననెడి ఆశలేదు. తాము వెళ్లవచ్చును” అని చెప్పి వారిని పంపివేసిరి. "సర్వ ధర్మా౯ పరిత్యజ్య మాం ఏకం శరణం ప్రజ" అను శ్లోకమును పలుమారు స్మరించువారు. రెండు మూడు సార్లు నేను “సెలవు పుచ్చుకొని మరల వచ్చేద" నని చెప్ప యత్నించితినిగాని అందుకు సమ్మతింపరైరి.